Smart Watch: 10-రోజుల బ్యాటరీ లైఫ్‌తో సరికొత్త స్మార్ట్ వాచ్
దిశ, వెబ్‌డెస్క్: దీర్ఘచతురస్రాకార డిజైన్‌లో ఉండే కొత్త Dizo Watch S భారత మార్కెట్లోకి విడుదలైంది...Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: దీర్ఘచతురస్రాకార డిజైన్‌లో ఉండే కొత్త Dizo Watch S భారత మార్కెట్లోకి విడుదలైంది. ఇది 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్లతో లోడ్ చేయబడింది. 24x7 హార్ట్ బీట్ రేటు, నిద్ర మానిటరింగ్‌ను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్(Smart Watch) 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిని మెటల్ ఫ్రేమ్‌తో అమర్చారు. దీని ధర రూ. 1,999.
స్పెసిఫికేషన్స్..
Dizo Watch S టచ్ ఇన్పుట్ల సపోర్ట్‌తో పెద్ద 1.57-అంగుళాల (200x320 పిక్సెల్‌లు) దీర్ఘచతురస్రాకార డిస్ప్లేను కలిగి ఉంది. ఇది కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో రక్షించబడింది. 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. డిజో వాచ్ S రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఎలిప్టికల్, యోగా, క్రికెట్, పర్వతారోహణ, ఫుట్‌బాల్ వంటి 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. స్టెప్ కౌంట్, కేలరీల ఖర్చు మొదలగు వాటిని రికార్డు చేయగలదు. Dizo Watch S 24x7 హార్ట్ బిట్, నిద్ర మానిటర్‌తో పాటు, రక్త ఆక్సిజన్ సంతృప్త స్థాయి (SpO2) స్థాయిని, ఋతు చక్రాలను ట్రాక్ చేస్తుంది. Dizo Watch S IP68-సర్టిఫైడ్ బిల్డ్‌లో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
Android, iOS డివైజ్‌లో Dizo యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వాచ్‌ను కనెక్ట్ చేసుకొవచ్చు. యాప్‌లోని GPSని ఉపయోగించి నడుస్తున్న మార్గాన్ని ట్రాక్ చేస్తుంది. Dizo Watch S బ్లూటూత్ v5.0 సపోర్ట్‌ను కలిగి ఉంది. Android 5.0 లేదా iOS 9.0లో నడుస్తున్న డివైజ్‌లకు వాచ్ అనుకూలంగా ఉంటుంది. ఇది 200mAh బ్యాటరీతో ఒక చార్జ్‌పై గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది.
డిజో వాచ్ S అసలు ధర రూ. 2,299, అయితే వాచ్ ప్రారంభ ధర రూ.1,999. ఇది మొదటగా క్లాసిక్ బ్లాక్, గోల్డెన్ పింక్, సిల్వర్ బ్లూ షేడ్స్‌లో లభిస్తుంది. వాచ్ ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది.