విషాదంగా స్వీట్ మెమోరీస్.. ఆ కోరిక తీరక ముందే వరుడు మృతి

నేటితరం చేసి శుభకార్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా వివాహ వేడుకలను నభూతో న భవిష్యతి అన్నరీతిలో జరుపుకుంటున్నారు.

Update: 2022-04-05 13:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేటితరం చేసే శుభకార్యాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా వివాహ వేడుకలను నభూతో న భవిష్యతి అన్నరీతిలో జరుపుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్‌, పోస్ట్ వెడ్డింగ్ షూట్, సేవ్ ది డేట్ షూట్ పేరుతో మినీ సినిమాను తలపించేలా తీస్తున్నారు. పెళ్లి నాటి మధుర స్మృతులను పదిలపర్చుకునేందుకు నవ జంటలు ఉత్సాహపడుతున్నాయి. అయితే ఈ షూట్‌ల పేరుతో ఫొటో గ్రాఫర్లతోపాటు వధూవరుడు సైతం సాహాసాలు చేస్తున్నారు. దీంతో ఇవ్వి కొన్ని విమర్శల పాలవుతుండగా.. మరికొన్ని ప్రాణాలను సైతం తీస్తున్నాయి. తాజాగా కేరళలో పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లో అపశృతి జరిగి వరుడు మృతి చెందగా.. వధువు ప్రాణాపాయస్థితిలో ఉన్నది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మార్చి 14న రెజిల్, కార్తీక వివాహం వైభవంగా జరిగింది. కడియంగడ్‌కు చెందిన వీరిద్దరికి పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి వీలు పడలేదు. దీంతో వారు మంగళవారం పోస్ట్ వెడ్డిండ్ షూట్‌కు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కోజికోడ్ సమీపంలోని కుట్టియాడికి దగ్గరలోని ఓ నదిలోకి ఫొటో షూట్ కోసం దిగారు. షూట్ జరుగుతున్న సమయంలో నది ప్రవాహానికి నవ జంట కొట్టుకుపోయింది. ఆ సమయంలో వారు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే నదిలో దూకి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వరుడు రెజిల్ మృతిచెందగా, వధువు కార్తీక పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటనలో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొన్నది. స్వీట్ మెమోరీస్‌గా ఉంటుందనుకున్న ఫొటో షూట్ విషాదంగా మారడంతో ఆ నవజంట కోరిక తీరకుండాపోయిందని బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.

Tags:    

Similar News