ఆయుర్వేద వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ.. ప్రతి జిల్లాలో ఆయుష్ హాస్పిటళ్లు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం..latest telugu news
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. ఈ మేరకు ప్రతి జిల్లాలో ఆయూష్ హాస్పిటళ్లను ఏర్పాటు చేయనున్నది. జిల్లా కేంద్రంలో తొలి విడత 20 బెడ్లతో సిద్ధం చేయాలని ప్రణాళికలు తయారు చేసింది. దీనిలో అన్ని విభాగాల వైద్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. పేషెంట్ల స్పందన బట్టి రాబోయే రోజుల్లో బెడ్ల సంఖ్యను పెంచాలని సర్కార్ భావిస్తున్నది. దీంతో పాటు మండల కేంద్రాల్లో 421 ఆయూష్ వెల్నెస్ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేయనున్నారు. నేషనల్ హెల్త్‌మిషన్ స్కీంలో వీటి నిర్వహణ, పర్యవేక్షణలు కొనసాగనున్నాయి.