గుడ్‌న్యూస్.. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులభతరం!
దిశ, వెబ్‌డెస్క్: చట్ట ప్రకారం ప్రతీ వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ, కొందరు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, కనీసం బండి నడపటం సరిగా రాకపోయిన విచ్చలవిడిగా వాహనాలు రోడ్లపైకి తీసుకొచ్చిన వీరంగం సృష్టించడం ఇప్పటికే మనం అనేకసార్లు చూశాం.
దిశ, వెబ్‌డెస్క్: చట్ట ప్రకారం ప్రతీ వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ, కొందరు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, కనీసం బండి నడపటం సరిగా రాకపోయిన విచ్చలవిడిగా వాహనాలు రోడ్లపైకి తీసుకొచ్చిన వీరంగం సృష్టించడం ఇప్పటికే మనం అనేకసార్లు చూశాం. కొందరు ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక దొరక్క లైసెన్స్ తీసుకోకుండా ఉంటే, మరికొందరు సమయమున్నా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నియమాలతో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ కాస్త సులభతరం చేసింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ప్రభుత్వం సరళీకృతం చేసింది. కొత్త నియమాల ప్రకారం.. డ్రైవింగ్ స్కూల్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవర్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది. టూ, త్రీ వీలర్ మోటారు వాహనాల శిక్షణా కేంద్రాలకు మినిమమ్ ఒక ఎకరం, భారీ వాహనాలు మరియు కార్గో ట్రక్కుల ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్‌కి అయితే రెండెకరాలు ఉండాలి. అంతేకాక ఎగ్జామినర్ కనీసం 12 తరగతి పాస్ అయ్యి ఉండాలని నియమాల్లో పేర్కొంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫిజికల్ టెస్ట్ ఆన్‌లైన్‌లో కూడా హాజరు కావచ్చు. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత ఆర్టీవో కార్యాలయాధికారికి చేరుకుంటుంది.