Patang : ‘పతంగ్’ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

వాటిలో స్పోర్ట్స్ జోనర్ లో తక్కువ సినిమాలు వచ్చాయి

Update: 2024-10-16 02:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో స్పోర్ట్స్ జోనర్ లో తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు, గాలిపటాల స్పోర్ట్స్ డ్రామాతో ‘పతంగ్’ అనే కొత్త మూవీ మన ముందుకు రాబోతుంది.

రిష‌న్ సినిమాస్ పతాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి నిర్మాణంలో ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి డైరెక్షన్ లో ఈ పతంగ్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో ప్రీతి ప‌గ‌డాల‌, ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, వంశీ పూజిత్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్‌పీ చ‌ర‌ణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లిట్ అయింది. ప్రస్తుతం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ మూవీ నుంచి పాటలు, టీజర్ విడుదల మూవీ పై అంచనాలను పెంచేసాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. పతంగ్ సినిమా డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. 

Full View

Tags:    

Similar News