భోజనానికి పిలిచి వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన దంపతులు..దానికి కారణం అదేనట..!

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో చాలా మహిళలు ఎదో విధంగా వేధింపులకు గురవుతున్నారు..Latest Telugu News

Update: 2022-06-16 06:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో చాలా మహిళలు ఎదో విధంగా వేధింపులకు గురవుతున్నారు. చిన్న పిల్లల కానుండి పెళ్లి అయిన స్త్రీల వరకు ఇలాంటివి ఎదుర్కొంటున్నారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భార్య, భర్తలు నివాసం ఉంటున్నారు. వివాహిత మహిళతో పొరుగింట్లో ఉండే వ్యక్తి రోజు మాట్లాడేవాడట..ఇది గమనించిన ఆ వివాహిత భర్త తన భార్యకు అతడితో మాట్లాడొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఆ మహిళ ఆ వ్యక్తితో మాట్లాడటం మానేసింది. అయినా ఆ వ్యక్తి మాత్రం మహిలతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీంతో మరింత కొపోద్రిక్తుడైన భర్త. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన భార్య సహకారంతో అతన్ని భోజనం పేరుతో ఇంటికి ఆహ్వనించాడు. పక్కింటి వ్యక్తి ఇంట్లోకి రాగానే దంపతులిద్దరూ అతని దుస్తులు విప్పేసి జననాంగాన్ని కోసేసారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు నేరుగా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వారు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దంపతులను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తులం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


Similar News