దిశ ఎఫెక్ట్.. అధికారులపై సీరియస్ అయిన కలెక్టర్
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: ‘కంపుకొడుతున్న సంగారెడ్డి’ శీర్షికన - The collector responded to the 'Disha' news article
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: 'కంపుకొడుతున్న సంగారెడ్డి' శీర్షికన 'దిశ' లో ప్రచురితమైన వార్త కథనంపై జిల్లా కలెక్టర్హనుమంతరావు తీవ్రంగా స్పందించారు. మున్సిపాలిటీలో మురికి కాలువలు నిండిపోయి, చెత్త కుప్పలు పేరుకుపోయే వరకు ఏం చేస్తున్నారని మున్సిపల్ సిబ్బందిపై నిప్పులు చెరిగారు. బుధవారం ఉదయం 'దిశ' లో కథనం చూసిన వెంటనే కమిషనర్చంద్రశేఖర్కు ఫోన్‌చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలా చెత్త కుప్పలు పేరుకుపోయిన, మురికి కాలువలో నీరు వెళ్లకుండా అయ్యే వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏం చేస్తారో తెలియదు అంతా క్లీన్ కావాలని ఆదేశించారు.
మున్సిపల్ సిబ్బందితో పాటు అవసరమైతే పంచాయతీ సిబ్బందిని కూడా వినియోగించాలని సూచించారు. గ్రేడ్1 మున్సిపాలిటీ దుస్థితి ఇలా ఉంటుందా..? అన్ని మండి పడ్డారు. చెత్త కుప్పలను తొలగించి, మురికి కాలువలన్నీ శుభ్రం చేయాలని సూచించారు. త్వరలోనే మున్సిపాలిటీని స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో చంద్రశేఖర్ మున్సిపల్ సిబ్బందిని రంగంలోకి దింపారు. తక్షణమే జేసీబీ యంత్రాలతో చెత్తతో నిండిపోయిన మురికి కాలువలు శుభ్రం చేయిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా అన్ని చెత్త కుప్పలు తొలగించి, కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రం చేస్తామని కమిషనర్ చంద్రశేఖర్ దిశ ప్రతినిధితో వెల్లడించారు. ఇదిలా ఉండగా తమ కాలనీల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసిన 'దిశ' యాజమాన్యానికి మున్సిపాలిటీ ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.