Dulquer Salmaan: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘లక్కీ భాస్కర్’.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందంటే? (పోస్ట్)

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

Update: 2024-11-06 10:34 GMT
Dulquer Salmaan: బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘లక్కీ భాస్కర్’.. 6 రోజుల్లో ఎన్ని కోట్లు సాధించిందంటే? (పోస్ట్)
  • whatsapp icon

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. దీనిని వెంకీ అట్లూరి(Venky Atluri) తెరకెక్కించగా.. సాయి కుమార్, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చున్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. దీపావళి కానుకగా ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) అక్టోబర్ 31న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా(Worldwide) 67.6 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు. అంతేకాకుండా దీపావళి మెగా బ్లాక్ బస్టర్(Mega Blockbuster) అని దుల్కర్ ఫొటోను పెట్టారు.


Read More..

Prabhas: గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభాస్.. వైరల్‌గా మారిన పోస్ట్

Tags:    

Similar News