Best electric scooter: మార్కెట్‌లోకి బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఏకంగా!

ప్రజెండ్ డేస్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

Update: 2024-11-18 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెండ్ డేస్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు(Electric vehicles) కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో ఏథర్​ రిజ్టా(Aether Rizta) దూసుకెళుతోంది. చాలా మందికి ఇది ఫస్ట్​ బెస్ట్ ఆప్షన్‌​గా నిలుస్తుంది. కానీ మార్కెట్‌లో చాలా తక్కువ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చింది. అదే రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 80కేఎంపీహెచ్​ ఉంటుంది. అంతేకాకుండా 2. 9 కిలో వాట్ల యూనిట్‌తో గొప్ప బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ను కూడా అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 159 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఈ స్కూటీ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్కులు(Telescopic forks) ఉంటాయి. వెనక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్(Single shock absorber) లను కలిగి ఉంటుంది. ముందు భాగంలో డిస్క్. వెనక డ్రమ్ బ్రేక్ సెటప్(Drum brake setup) కూడా ఉంటుంది.

ఈ ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. జెడ్(Jeḍ) (2.9 కిలోవాట్), ఎస్ (2.9 కిలోవాట్), జెడ్ (3.7 కిలోవాట్). అనే మూడు వేరియంట్లో వస్తుంది. దీన్ని 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇక ఈ స్కూటర్ ధరలు చూసినట్లైతే.. రూ. 1. 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్సీ ఫీచర్లతో అయితే ప్రో ప్యాక్ ఎక్స్-షోరూమ్(Pro pack ex-showroom) రేటు 13,000 ప్రీమియంతో రానుంది. రిజ్టా జెడ్ (2.9 కిలోవాట్ల) ధర రూ .1.25 లక్షలు, ప్రో ప్యాక్ అదనంగా రూ .15,000లకు వస్తుంది. రిజ్టా జెడ్(Rizta Z) (3.7 కిలోవాట్) ధర రూ .1.45 లక్షలు, ప్రో ప్యాక్(Pro pack) అదనంగా రూ .20,000!

Tags:    

Similar News