Varun-Lavanya: లావణ్య మూవీస్ చేయకపోవడానికి కారణం అదే.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది పూర్తి అయిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయినప్పటికీ నుంచి లావణ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో ఆమెకు మెగా ఫ్యామిలీ కండీషన్ పెట్టడం వల్ల చేయట్లేదని ఓ ప్రచారం మొదలైంది. అంతా అబద్ధమని తేలడంతో ఇటీవల లావణ్య(Lavanya Tripathi) ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ మాత్రం వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. ప్రజెంట్ మెగా ప్రిన్స్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’(Matka). ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్(Varun Tej) భార్య రీఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేయడంతో పాటు గుడ్ న్యూస్(good news) ప్రకటించాడు. ‘‘ప్రజెంట్ లావణ్య సినిమాలు చేయడానికి రెడీ అయింది. గతంలో అంటే ఏది పడిదే అది ఓకే చేసేది. పాత్రకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఆ జర్నీ డిఫరెంట్. కానీ ఇప్పుడు అంత అవసరం తనకి లేదు. తాను కంఫర్టబుల్ ప్లేస్‌లోనే ఉంది. కాబట్టి మంచి క్యారెక్టర్ వస్తేనే చేస్తుంది. ప్రస్తుతం లావణ్య ఇంట్లో ఉంటూ కథలు వింటోంది. త్వరలోనే సినిమా చేస్తుంది.
ఇద్దరం కూడా కథ భాగుంటే చేయాలనుకుంటున్నాము. మంచి పాత్ర దొరకాలి దానికి తోడు స్క్రిప్ట్ కూడా కుదరాలి. అప్పుడే లావణ్య రీఎంట్రీ ఇస్తుంది. అయితే పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని మా ఫ్యామిలీ కండీషన్స్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అలాంటి మైండ్ సెట్ మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు. నీ ఇష్టం అని చెప్పాం. ఇక పిల్లల గురించి అయితే ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. లావణ్య(Lavanya Tripathi) కు నచ్చినప్పుడే ముందడుకు వేస్తాము’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ వరుణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక లావణ్య రీ ఎంట్రీ గురించి తెలుసుకున్న అభిమానులు ఖుషీ అవుతున్నారు.