Telegram: టెలిగ్రామ్‌లో అదిరిపోయే న్యూ ఫీచర్స్!
దిశ, ఫీచర్స్ : స్వదేశీ ఇన్స్టంట్మెసేజింగ్ యాప్టెలిగ్రామ్ రోజుకో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తూ ఇతర
దిశ, ఫీచర్స్ : స్వదేశీ ఇన్స్టంట్మెసేజింగ్ యాప్టెలిగ్రామ్(Telegram) రోజుకో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తూ ఇతర మెసేజింగ్ యాప్స్‌కు గట్టి పోటీనిస్తోంది. ఈ మేరకు తాజాగా ఆటో డిలీట్ చాట్ ఆప్షన్, క్వాలిటీ పిక్చర్-ఇన్-పిక్చర్ సెట్టింగ్స్, మెరుగైన బాట్ కాన్ఫిగరేషన్ సహా ప్రైవసీ పెంచేందుకు కొత్త ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేసింది.
కస్టమ్ నోటిఫికేషన్ సౌండ్స్..
యూజర్లు నోటిఫికేషన్ కోసం తమకు నచ్చిన సౌండ్స్‌ను సెట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం గరిష్టంగా 300 KB సైజు గల ఫైల్స్ ఎంపిక చేసుకోవచ్చు. వీటిని ఐదు సెకన్ల వరకు మెసేజ్ టోన్స్‌గా సెట్ చేసుకునే సౌలభ్యం ఉండగా.. టెలిగ్రామ్ సెట్టింగ్స్> నోటిఫికేషన్స్ అండ్ సౌండ్స్ అనే ఆప్షన్‌లో ఈ ఫీచర్‌ను పొందవచ్చు.
కస్టమ్ మ్యూట్ డ్యూరేషన్..
టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. కుప్పలు తెప్పలుగా వచ్చిపడే మెసేజ్‌లతో అలర్ట్ టోన్ మోగుతూనే ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా యూజర్లకు 'కస్టమ్ మ్యూట్ డ్యూరేషన్' సెట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీన్ని 8 గంటల నుంచి రెండు రోజుల వరకు మ్యూట్ చేయవచ్చు. అంతేకాదు ప్రైవసీ సెట్టింగ్స్‌లో భాగంగా యూజర్స్ తమ చాట్ లేదా కన్వర్జేషన్స్ డిలీట్ చేసేందుకు రెండు రోజులు, మూడు వారాలు, నాలుగు నెలలు కాలపరిమితితో లిమిటెడ్ టైమ్ ఫ్రేమ్ ఏర్పాటుచేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఆటో డిలీట్ మెనూ..
ఈ మెనూ.. చాట్ డిలీట్ కోసం ఉపయోగపడుతుంది. ఇది ప్రీ-సెట్ చేసిన సమయం తర్వాత చాట్ కంటెంట్స్‌ను ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది. గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల లేదా అంతకుమించిన టైమర్ ఆప్షన్స్‌ను మనం ఎంచుకునే వీలుంది.
టెలిగ్రామ్ బాట్ డెవలప్‌మెంట్ టూల్స్..
బాట్స్ కోసం మెరుగైన ఇంటర్‌ఫేస్‌లను రూపొందించడంలో డెవలపర్స్‌కు సాయపడే టూల్స్ కోసం టెలిగ్రామ్ v8.7.0 మద్దతును అందిస్తుంది. యాప్‌లోని వినియోగదారు థీమ్‌కు సరిపోయేలా బాట్స్‌ను ఇకపై ప్రోగ్రామ్ చేయవచ్చు.
పిక్చర్-ఇన్-పిక్చర్ సెట్టింగ్స్ ..
యూజర్స్ తమకు ఇష్టమైన షోస్ లేదా వీడియోలను వీక్షించే టప్పుడు ఒకరికొకరు టెక్స్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది టెలిగ్రామ్. అలాగే ఆండ్రాయిడ్, iOS వినియోగదారులు ఇతర భాషల మెసేజెస్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకునే ఆప్షన్ అందిస్తుంది.