బ్రేకింగ్: కేసీఆర్‌‌కు అనూహ్య షాక్.. ఢిల్లీకి గవర్నర్ తమిళిసై

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ(సోమవారం) రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

Update: 2022-04-04 13:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ(సోమవారం) రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు మధ్య ఇటీవల కాలంలో దూరం పెరిగింది. ఈ తరుణంలో తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో గవర్నర్ పర్యటన ఉత్కంఠత రేపుతోంది. గవర్నర్ ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలను తెలియజేసేందుకు కాసేపట్లో రాజ్ భవన్ వేదికగా రాష్ట్ర మీడియా ప్రతినిధులతో గవర్నర్ భేటీ కానున్నారు.

కాగా, ఇటీవల ఉగాది ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. నా ఇన్విటేషన్‌ను గౌరవించనందుకి నేను బాధపడడం లేదు అంటూ వ్యాఖ్యలు చేసారు. 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించాను. కొందరు వచ్చారు. రాని వారి గురుంచి నేను చెప్పేది ఏమి లేదు అని పేర్కొన్నారు. నన్ను ప్రగతి భవన్ ఉగాది కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి అటెండ్ అయ్యే దానిని. యాదాద్రికి నన్ను ఆహ్వానించలేదు. నాకు వెళ్లాలని ఉండే. నేను వివాదాస్పదం చేసే వ్యక్తిని కాదు. గ్యాప్‌ని సృష్టించే వ్యక్తినీ కాదు. కొన్ని అంశాలపై డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఆహ్వానాలను పంపినా పట్టించుకోవడం లేదని, ఇగ్నోర్ చేశారంటూ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ మాటలు మాట్లాడిన రెండ్రోజులకే కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడం పలు చర్చలకు దారి తీస్తోంది.

Tags:    

Similar News