తమను విడదియోదంటూ.. బోనాలతో ఉపాధ్యాయ దంపతుల నిరసన

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే జరిపించాలని నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ

Update: 2022-07-25 07:45 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉపాధ్యాయ దంపతుల బదిలీలను వెంటనే జరిపించాలని నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఉపాధ్యాయ దంపతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఉదయం వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు బోనాలతో వచ్చి కలెక్టర్ ఎదుట దుర్గమ్మ తల్లి సమక్షంలో నిరసన తెలియజేశారు. సోమవారం ఉదయం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పాజ్ బదిలీలు జరపక పోవడంతో ప్రయాణం భారంగా మారిందని. శారీరకంగా మానసికంగా తీవ్ర అలసటకు లోనవుతున్నట్లు వారు వివరించారు. ఈ పరిస్థితులు విద్యా బోధన నైపుణ్యం. నాణ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని విన్నవించారు. ఏడు నెలలుగా ఎదిరి చూపులే కానీ జీవో.317 అమలులో భాగంగా ఉపాధ్యాయులను వివిధ జిల్లాలకు కేటాయించారు. అనంతరం ఉపాధ్యాయ దంపతులను ఒకే జిల్లా కేడర్‌కు మార్చాలి.

కానీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దంపతుల బదిలీలపై నిషేధం విధించారు. నిజామాబాద్ జిల్లాలో కూడా స్పౌజ్ బదిలీలు నిషేధించారు. ఎందుకు ఈ నిషేధం అమలులో ఉందో..? ఎప్పుడు స్పౌజ్ బదిలీలు. జరుపుతారో..? తెలియక నిజామాబాద్ జిల్లా స్పౌజ్ ఉపాధ్యాయులు గడిచిన 7 నెలలుగా ఎదురు చూస్తున్నారు అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఉపాధ్యాయ ఎమ్మెర్జీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నామన్నరురు. ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నప్పటికీ తమ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని వాపోయారు. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరిపించాలనే డిమాండ్‌తో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయుల పిల్లలు, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఉపాధ్యాయ కుటుంబాలను విడదీసి నెలలు గడుస్తున్నా పరిష్కారం చూపించే దిక్కు లేకుండా పోయిందని ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు మరొక చోట విడిపోయి జీవించాల్సి రావడం దారుణమన్నారు. అమ్మానాన్న విడివిడిగా ఉండటం చాలా బాధగా ఉందని చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తమ వారిని ఒకటి చేయాలని ఉపాధ్యాయుల తల్లిదండ్రులు, పిల్లలు అభ్యర్థించారు. నిజామాబాద్ జిల్లాకు రావడం కోసం 146 మంది ఉపాధ్యాయ దంపతులు అర్జీ పెట్టు కున్నారు. సుమారు 1200 వరకు ఉపాధ్యాయ పోస్టులు నిజామాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ ఉపాధ్యాయ దంపతుల బదిలీలకు మోక్షం దొరకడం లేదు అన్నారు. స్పౌజ్ బదిలీల అంశం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పరిష్కరించగలరని ఉపాధ్యాయ దంపతులు తెలిపారు. ముఖ్యమంత్రి స్పౌజ్ బదిలీల విషయాన్ని సానుకూల దృక్పథంతో వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ దంపతులు వేడుకున్నారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా స్పౌజ్ ఫోరం సభ్యులు సోమయ్య గారి నరేష్, గగన్ కుమార్, సుజాత, విజయలక్ష్మి, రాజేశ్వరి, శ్రీలక్ష్మి, బైండ్ల రాజు, స్వామి కుమార్ పాల్గొన్నారు.


Similar News