మతిస్థిమితం లేని విద్యార్థిపై టీచర్ దాడి
దిశ, ఖమ్మం రూరల్: మతిస్థిమితం లేని విద్యార్థిపై - Teacher attacks student at Christian school in Karunagiri
దిశ, ఖమ్మం రూరల్: మతిస్థిమితం లేని విద్యార్థిపై ఓ టీచర్దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండా పంచాయతీ పరిధిలోని నాయుడుపేటలో గల కరుణగిరిలో క్రిస్టియన్పాఠశాల ఉంది. ఇదే పంచాయతీకి చెందిన ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఓర్స్ క్రాంతి కుమార్కుమారుడు అజయ్ కుమార్ కి మతిస్థిమితం లేకపోవడంతో అతనిని గత మూడు నెలల క్రితం కరుణగిరి పాఠశాలలో చేర్పించాడు. 25 రోజుల క్రితం ఓర్స్అజయ్కుమార్కంటి దెబ్బ తగలడంతో ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించాడు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లో గల ఓ ప్రైవేట్హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించాడు. పరిశీలించిన అక్కడి డాక్టర్లు అజయ్కుమార్కంటికి దెబ్బ ప్రమాదవశాత్తు తగ్గలేదని, కంటిపై దాడి చేయడం వలనే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు చెప్పారు. తాజాగా సోమవారం విద్యార్థిని ఇంటికి తీసుకురాగా కరుణగిరిలో జిమ్చేసే యువకులు అజయ్కుమార్కంటికి ఉపాధ్యాయుడు కొట్టడం వలన జరిగిందని తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు కలిసి బిషప్‌ను అడిగేందుకు వచ్చారు. మతిస్థిమితం లేని మా కుమారునిపై దాడి చేయడం సరికాదని స్థానికులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని బిషప్‌ను ప్రశ్నించారు.
బిషప్ సమాధానం చెప్పకుండా ఆందోళనకారులపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు బిషప్హౌస్ఎదుట ఆందోళన చేపట్టారు. బిషప్సమాధానం సరిగ్గా లేదని, గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు రూరల్‌పోలీసులకు ఫిర్యాదు చేశారు.