ఇండియాలో $1.3 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న సుజుకి మోటార్

దిశ,వెబ్‌డెస్క్: జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు,..telugu latest news

Update: 2022-03-19 08:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలను ఉత్పత్తి చేయడానికి సుమారు 150 బిలియన్ యెన్‌ల (1.26 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని జపాన్ మీడియా శనివారం తెలిపింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా శనివారం భారత్‌లో పర్యటించి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. Nikkei వ్యాపార దినపత్రిక ప్రకారం, భారతదేశంలో వచ్చే ఐదేళ్లలో సుజుకి 5 ట్రిలియన్ యెన్‌లను పెట్టుబడి పెట్టే ప్రణాళికలలో ఉందని పేర్కొంది. కిషిడా పర్యటనలో భాగంగా ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సుజుకి భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి శ్రేణిని నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ నివేదికలను ధృవీకరించడానికి సుజుకి మోటార్ ప్రతినిధి నిరాకరించారు.

Tags:    

Similar News