Surya: ‘గజిని’ సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన సూర్య

కోలీవుడ్ (Kollywood) స్టార్ సూర్య (Surya) ప్రజెంట్ ‘కంగువ’ (Kanguva) సినిమాతో బిజీగా ఉన్నాడు.

Update: 2024-10-24 14:01 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ సూర్య (Surya) ప్రజెంట్ ‘కంగువ’ (Kanguva) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రస్టీజియస్ మూవీకి డైరెక్టర్ శివ (Director Shiva) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ (Periodic Action) ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ మూవీలో దిశ పటానీ (Disha Patani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్ (Bobby Deol) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. నవంబర్ (November) 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య.. ‘గజిని’ (Ghajini) సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.

‘‘గజిని-2’ ఐడియా అల్లు అరవింద్‌దే. సీక్వెల్ సాధ్యమౌతుందా అని నన్ను అడిగారు. కచ్చితంగా కుదురుతుందని చెప్పాను. చర్చలైతే మొదలయ్యాయి. ప్రస్తుతానికి ప్రాసెస్ (process) లో ఉంది. గజిని-2 (Ghajini-2) వస్తుందనే భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. సూర్య కెరీర్‌లో ది బెస్ట్ చిత్రంగా నిలిచింది ‘గజిని’. అప్పట్లో సౌత్ ఇండిస్ట్రీ (South Industry)ని ఓ ఊపు ఊపేసింది ఈ మూవీ. అలాంటి ఈ సినిమా ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధం అవుతుందని తెలియడంతో.. సూర్య ఫ్యాన్స్ (fans) ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News