దమ్ముంటే మోడీని ఒప్పించు.. బండికి పీసీసీ చీఫ్ సవాల్
కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party), రేవంత్ సర్కార్ (revanth Government) పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలకు స్పందించిన టీపీసీసీ చీఫ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి దమ్ముంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఒప్పించాలని సవాల్ చేశారు.
అంతేగాక ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు (Telangana BJP Leaders) బీసీల ధర్నాకు మొహం చాటేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేశాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక బీఆర్ఎస్ (BRS) తో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపణలు చేసిన ఆయన.. సొంతపార్టీ నేతలే బండి సంజయ్ వైఖరి పై గుర్రుగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇక తాను కేంద్ర మంత్రి అన్న సంగతి మర్చిపోయి దిగజారి మాట్లాడుతున్నాడని, ఇకనైనా బాధ్యత గల కేంద్రమంత్రిగా వ్యవహరించాలని హితవు పలికారు.
కాగా ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేబినేట్ విస్తరణ ఏఐసీసీ చేతిలో ఉండటమేంటని, రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి లా మరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సచివాలయం నుంచి ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (AICC Incharge Meenakshi Natarajan) మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేంటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీదే తుది నిర్ణయమని చెప్పడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.