Mohammed Zubair: మహమ్మద్ జుబైర్‌కు బెయిల్ మంజూరు..
Supreme Court Grants 5 days Interim Bail to Alt News' Mohammed Zubair| ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: Supreme Court Grants 5 days Interim Bail to Alt News' Mohammed Zubair| ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. మతపరమైన మనోభావాలను కించపరిచిన విషయంలో గతంలో పిటిషన్లు దాఖలు చేసినా.. మహమ్మద్ జుబైర్‌కు బెయిల్ మంజూరు కాలేదు. దీంతో ఆయన ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.
ట్విట్టర్‌లో హిందూ మత గురువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు మహమ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో బెయిల్ కోసం సీతాపూర్ న్యాయస్థానంను ఆశ్రయించాడు. దీంతో అక్కడ 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలహాబాద్ న్యాయస్థానంలో కూడా ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయినా కోర్టు స్పందించలేదు. దీనిని సవాల్ చేస్తూ మహమ్మద్ జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీంతో శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఇందిరా బెనర్జీ ధర్మాసనం.. ఐదు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో ట్విట్టర్‌లో పోస్టులు రాయడం కానీ, ఆధారాలు ధ్వంసం చేయడం కానీ, ఢిల్లీ దాటి బయటకు వెళ్లడానికి ప్రయత్నించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల గడువు ముగిశాక.. మరోసారి కేసును విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.