9 గంటల కంటే తక్కువ నిద్రించే పిల్లల్లో ఈ సమస్య..
దీర్ఘకాలిక హానిని సూచిస్తుందని ఆయన అన్నారు. Sleeping less than nine hours can cause serious mental problems.
దిశ, వెబ్‌డెస్క్ః యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (UMSOM) పరిశోధకుల నేతృత్వంలో ఓ కొత్త అధ్యయనం నిర్వహించారు. ఆ అధ్యయనంలో, ప్రాథమిక పాఠశాల వయస్సు పిల్లలు రోజులో 9 గంటల కంటే తక్కువ నిద్రపోతే వారి జ్ఞాపకశక్తి, తెలివితేటలకు బాధ్యత వహించే మెదడు ప్రాంతంలో గణనీయమైన తేడాలు వస్తాయని తెలిసింది. ఈ వయసు పిల్లలు తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు సరైన నిద్ర పొందాలని సూచిస్తున్నారు. ఈ అధ్యయనం లాన్సెట్ చైల్డ్ అండ్ అడాలసెంట్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. పిల్లల నిద్రలో వైవిధ్యాలు తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయని ఇందులో పేర్కొన్నారు. తక్కువ నిద్రపోయేవారిలో నిరాశ, ఆందోళన, హఠాత్తుగా ప్రవర్తనల్లో మార్పులు కనిపిస్తాయిని ANI నివేదించింది.
ఇక, నిద్ర లేకపోవడం అనేది నిర్ణయం తీసుకోవడం, సమస్యను పరిష్కరించడం, జ్ఞాపకశక్తి వంటి సమస్యలకు దారితీస్తుంది. కాగా, ప్రస్తుత అధ్యయనం కోసం, అడాలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ (ABCD) అధ్యయనంలో పాల్గొన్న 9, 10 సంవత్సరాల మధ్య వయస్సు గల 8,300 కంటే ఎక్కువ మంది పిల్లల నుండి సేకరించిన సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. UMSOMలో ప్రొఫెసర్ అయిన జీ వాంగ్ ప్రకారం, అధ్యయనం ప్రారంభంలో, రాత్రి వేళల్లో తొమ్మిది గంటల కంటే తక్కువ నిద్రపోయే పిల్లలు, మెదడులోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ బూడిద పదార్థం, లేదంటే అది చిన్న పరిమాణంలో మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. ఇక, ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లతో శ్రద్ధ, జ్ఞాపకశక్తి, నిరోధక నియంత్రణ వంటి విషయాల్లో మెరుగ్గా ఉంటారని తెలిపారు. తగినంత నిద్ర లేని వారికి దీర్ఘకాలిక హానిని సూచిస్తుందని ఆయన అన్నారు.