అడ్డగోలుగా మెడికల్'డిగ్రీలు'.. విద్యార్థుల్లో తగ్గనున్న క్వాలిటీ?
దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల్లో మెడికల్కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో కొందరు రూల్స్‌కు విరుద్ధంగా డిగ్రీలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల్లో మెడికల్కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో కొందరు రూల్స్‌కు విరుద్ధంగా డిగ్రీలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఇండియాకు వచ్చిన తర్వాత ఆయా దేశాల్లో ఎలాంటి తరగతులకు హాజరు కాకుండానే ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసి కోర్సులు పూర్తయినట్లు డిగ్రీలు పొందుతున్నట్లు తెలుస్తున్నది. వాటితోనే ఏకంగాఎఫ్ఎమ్జీఈ (ఫారెన్మెడికల్ గ్రాడ్యుయేట్ఎగ్జామ్స్) కోసం అప్లై చేస్తున్నారు. నేషనల్మెడికల్కమిషన్నిబంధనలకు ఇది విరుద్ధమని మెడికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. చైనా నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉండగా, రష్యా, ఉక్రెయిన్మధ్య వార్తర్వాత ఉక్రెయిన్నుంచి వచ్చినోళ్లు కూడా ఇదే విధానం ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నదని మెడికల్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన విద్యార్థుల్లో క్వాలిటీ పెరగదని, తద్వారా మెడికల్ సిస్టంకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని సీనియర్డాక్టర్లు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రాక్టికల్స్ కోసం విదేశీ యూనివర్సిటీలు మన రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్మెడికల్కాలేజీలను ఆశ్రయించినట్లు సమాచారం. కరోనా ప్రభావంతో చైనా, యుద్ధ ప్రభావంతో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు సిక్రెట్‌గా ఇక్కడే ప్రాక్టికల్స్, పరీక్షలు రాపిస్తుండటం గమనార్హం.
ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నారు...?
మన దేశంలో హౌజ్ సర్జన్ కలుపుకొని ఐదున్నర సంవత్సరాలలో ఎంబీబీఎస్డిగ్రీ ఇస్తున్నారు. కానీ ఉక్రెయిన్లో 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఏకంగా ఎండీ డిగ్రీ ఇచ్చేస్తున్నారు. ఇండియాలో పోస్టుగ్రాడ్యువేషన్‌కు మాత్రమే ఎండీ ఇస్తున్నారు. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ వైద్య విద్యపై పెద్దగా అపప్రద, నాణ్యతా లేమి అభియోగాలు లేనప్పటికీ మన దగ్గర ప్రమాణాలకీ, అక్కడ విద్యకు చాలా తేడా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. పైగా మనతో పోల్చుకుంటే కోర్సు ఫీజులు కూడా తక్కువగా ఉన్నాయి. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఫీజులు కట్టలేని వాళ్లంతా కన్సల్టెంట్ల ద్వారా ఉక్రెయిన్తదితర దేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే కోర్సులు పూర్తి చేసినోళ్లలో కేవలం 20 నుంచి 30 శాతం మందే మొదటి ప్రయత్నంలో ఎఫ్ఎమ్‌జీఈ పరీక్షలో పాసవుతున్నారు. ఫెయిల్ అయిన వారు మెడికల కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పొందేందుకు అవకాశం లేనందున దొడ్డిదారి ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఇటీవల ఇద్దరు డాక్టర్లు తప్పుడు విధానంలో రిజిస్ట్రరై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
స్పెషల్కేటగిరీ కింద అవకాశం ఇవ్వాలి: డా.చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు
విదేశాల నుంచి వచ్చినోళ్లకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోకపోతే అడ్డుగోలుగా మెడికల్డిగ్రీలు ప్రాసెస్పెరిగిపోయే ప్రమాదం ఉన్నది. ఇది మెడికల్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఉక్రెయిన్లో చదువుతూ మన దేశానికి వచ్చిన వైద్య విద్యార్థుల కళాశాలల యాజమాన్యంతో, అక్కడి మంత్రిత్వ శాఖతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది. కానీ, ప్రభుత్వం ఆ వివరాలు సేకరించకుండా, అదనపు సీట్లు కేటాయిస్తామనడం, లక్షల్లో ఖర్చులు భరిస్తామనడం తొందరపాటుగా చర్యగానే భావిస్తున్నాం. దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ఉక్రెయిన్ తరహా ఫీజులతో మిగిలిన సెమిస్టర్స్, క్లినికల్స్ పూర్తి చేసుకోవడానికి అవకాశమిచ్చి భారత వైద్య, విద్య నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించి ప్రత్యేక పరిస్థితుల్లో అవార్డ్ చేయబడిన మెడికల్ డిగ్రీగా ప్రభుత్వాలనే స్పష్టంగా పేర్కొంటూ ఇవ్వాలి. దీని వలన తెలంగాణలో సుమారు 700 మంది ఎంబీబీఎస్విద్యార్ధులకు మేలు జరుగుతుంది.