ఊపిరి పోయిన ఐదుగురు జీవితాల్లో వెలుగులు నింపిన విద్యార్థి!

Update: 2022-02-16 10:43 GMT

దిశ, చిన్నశంకరంపేట: రోడ్డు యాక్సిడెంట్‌లో ఊపిరిపోయిన మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఓ విద్యార్థి ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రోజు వారీగా పాఠశాలకు వెళుతూ.. సోమవారం రోజు ఇంటి నుంచి బయలుదేరి బస్టాండ్ వద్దకు చేరుకుంటున్న తరుణంలో మినీ వ్యాన్ ఢీ కొట్టడంతో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి.




కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం టీ. మాందాపూర్ గ్రామానికి చెందిన గొల్ల రాములు, మంజుల దంపతుల కుమారుడు లోకేష్ (16) మెదక్ మండలం రాజు పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రోజువారీగా సోమవారం పాఠశాలకు ఇంటి నుండి బయలుదేరి బస్టాండ్ వద్దకు చేరుకుంటున్న తరుణంలో.. చేగుంట నుండి వస్తున్న ఓ మినీ వ్యాన్ లోకేష్ ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలవడంతో లోకేష్‌ను హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.




అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా విద్యార్థికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో విద్యార్థి చికిత్స పొందుతూ.. మంగళవారం రాత్రి మృతి చెందాడు. కుమారుడు లేడన్న ఆవేదనలో కూడా అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు రాములు, మంజుల ముందుకు వచ్చారు. కిడ్నీ, కాలేయం, కళ్లు దానం చేసి ఐదుగురు జీవితాల్లో కొత్త జీవితాన్ని నింపారు. యశోద హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది సెల్యూట్ చేసి గౌరవ వందనాలతో లోకేష్ పార్థివ దేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి పంపారు.

గ్రామంలో విషాదఛాయలు..

విద్యార్థి లోకేష్ మృతి చెందిన వార్త తెలియగానే తోటి విద్యార్థులు గ్రామస్తులు కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. మంగళవారం అంత్యక్రియలకు గ్రామ సర్పంచ్ బిక్షపతి గౌడ్, ఎంపిటిసి ప్రసాద్ గౌడ్ తో పాటు తోటి స్టూడెంట్స్, ఉపాధ్యాయులు అంత్యక్రియలో పాల్గొన్నారు.

Tags:    

Similar News