రెబల్ స్టార్‌తో ఒక్కరోజైనా ఓకే.. బిగ్‌బాస్ బ్యూటీ
దిశ, సినిమా: కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారిన..telugu latest news
దిశ, సినిమా: కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా స్టార్ ఒప్పుకోవాలే గానీ తనతో పెళ్లికి అమ్మాయిలు క్యూ కడతారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతోమంది ఓపెన్‌గానే తమ కోరికను బయటపెడుతుంటారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్, రెండో వారమే ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేసిన శ్రీ రాపాక చేరిపోయింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు తాను కూడా పెళ్లి పీటలు ఎక్కేదే లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని వెల్లడిస్తూ.. ఆయన నటించిన 'ఈశ్వర్' మూవీ తనకు చాలా ఇష్టమని, అప్పటి నుంచే ప్రభాస్ అంటే క్రష్ అని తెలిపింది. ఈ మేరకు ప్రభాస్‌ను పెళ్లి చేసుకొని ఒక్కరోజు జీవించినా చాలంటూ పేర్కొంది. అయితే అది ఎలాగూ జరిగే చాన్స్ లేదు కాబట్టి ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్ చేస్తానని చెప్పింది. కాగా ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.