భారత్‌కు లంకేయుల వలసలు
చెన్నై: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక నుంచి భారత్‌కు వలసలు ప్రారంభమయ్యాయి.
చెన్నై: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక నుంచి భారత్‌కు వలసలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం లంక నుంచి 21 మంది శరణార్థులు రామేశ్వరం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. రామేశ్వరంలోని ధనుష్కోటి సమీపంలో వీరిని గుర్తించినట్లు చెప్పారు. వీరిని భారత తీర ప్రాంత దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రెండు పడవల్లో భారత్‌కు చేరకున్నట్లు వెల్లడించారు. వీరందరినీ మండపం శరణార్థుల క్యాంపుకు తరలించినట్లు చెప్పారు. లంకలో తీవ్రసంక్షోభం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శరణార్థుల క్యాంపుల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికిగానూ ఇప్పటికే సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వ అధికారులను సిద్ధంగా ఉండమని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, ప్రధాని మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఆయన లేఖ రాశారు. ఇక శ్రీలంకలో సంక్షోభం తర్వాత భారత్ చేరిన శరణార్థుల సంఖ్య 40 దాటింది.