అయ్యప్ప భక్తులకు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ట్రైన్

ప్రతి ఏటా ఏడాది చివర్లో భక్తులు అయ్యమాలలు ధరించి శబరిమల ప్రయాణం అవుతుంటారు.

Update: 2024-10-22 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏటా ఏడాది చివర్లో భక్తులు అయ్యమాలలు ధరించి శబరిమల ప్రయాణం అవుతుంటారు. ఇది తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే శబరిమల చేసుకోవాలనుకునే భక్తులు రవాణా సదుపాయాల తక్కువగా వల్ల ప్రతిసారి ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలంటి అయ్యప్ప భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మాల ధారులకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు తొలిసారిగా భారత్ గౌరవ్ రథ్ పేరుతో ప్రత్యేక రైలును ప్రారంభించింది. ఈ రైల్లో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రైలు నవంబర్ 16వ తేదీ ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనుంది. అక్కడి నుంచి నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆగుతుంది. ఆయా స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఈ రైలులో ఎక్కి ప్రయాణించవచ్చు. ఇక ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరిమలకు 120 గంటల్లో చేరుకుంటుంది. ఇక ఈ రైలు చార్జీల వివరాలు గమనిస్తే.. స్లీపర్ బెర్త్ టికెట్ ధర రూ.11,475గా ఉంది. అదే థర్డ్ ఏసీ అయితే రూ.18,790గా ఉంది.


Similar News