కేంద్రానికి రాహుల్ 10 ప్రశ్నలు
న్యూఢిల్లీ: పార్లమెంటులో ముఖ్య అంశాలను లేవెనెత్తడానికి యత్నిస్తున్న ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
న్యూఢిల్లీ: పార్లమెంటులో ముఖ్య అంశాలను లేవెనెత్తడానికి యత్నిస్తున్న ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తూ కేంద్రం అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ఫేస్‌బుక్ వేదికగా 10 ప్రశ్నలకు సంధించారు. ఇందులో ప్రధాని మోడీని నియంత్రుత్వ రాజుగా పేర్కొన్న ఆయన.. కేంద్రాన్ని ప్రశ్నించారన్న కోపంతో.. 57మంది ఎంపీలను అరెస్టు చేయగా, 23మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపించారు.
రాహుల్ సంధించిన ప్రశ్నలివే..
1. 45ఏళ్లలోనే నిరుద్యోగిత రేటు అధికంగా ఎందుకుంది? ఏటా 2కోట్ల ఉద్యోగాలన్న హామీ ఏమైంది?
2. పెరుగు, తృణధాన్యాలు వంటి నిత్యవసర వస్తువులపైనా జీఎస్టీ విధించి ప్రజల నోటి కాడి ముద్దను ఎందుకు లాక్కుంటున్నారు?
3. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే ఎందుకు 80దాటింది?
4. 2ఏళ్ల నుంచి ఆర్మీలో ఒక్క నియామకమూ చేయని కేంద్రం.. ఇప్పుడు 'అగ్నిపథ్' తీసుకొచ్చింది. 4ఏళ్ల కాంట్రాక్ట్‌పై యువత బలవంతంగా ఎందుకు 'అగ్నివీర్'గా మారుతున్నారు?
5. నిత్యవసరాలు, ఇంధన ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రజలకు ఇంకెప్పుడు ఊరట?
6. చైనా ఆర్మీ లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోకి ప్రవేశించింది. మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు?
7. పంటల బీమా చేసిన బీమా కంపెనీలకు రూ.40,000 కోట్లు లబ్ధి చేకూరింది. కానీ, 2022 నాటికి 'రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం' అనే వాటి హామీపై మౌనంగా ఉన్నాయి. ఎందుకు?
8. రైతులకిచ్చిన కనీస మద్దతు ధర హామీ ఏమైంది? సాగు చట్టాల ఆందోళనల సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం హామీ ఎటుపోయింది?
9. సీనియర్ సిటిజన్లకు ట్రైన్ టికెట్లపై 50శాతం రాయితీ ఎందుకు ఆగిపోయింది?
10. 2014లో కేంద్రంపై రూ.56లక్షల కోట్ల అప్పు ఉండేది. అది ఇప్పుడు రూ.139లక్షల కోట్లకు పెరిగి, వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.156లక్షల కోట్లకు చేరుతుంది. దేశాన్ని అప్పుల ఊబిలో ఎందుకు ముంచుతున్నారు?