అప్పటి నుంచి ఆ వీడియోలు చూడటం ఆపేశా.. సింగర్ చిన్మయి భర్త ట్వీట్

నటి ఓవియా బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత రెండు రోజుల నుంచి ఆమెకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Update: 2024-10-13 14:34 GMT

దిశ, సినిమా: నటి ఓవియా బిగ్‌బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత రెండు రోజుల నుంచి ఆమెకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే దీనిపై ఆమె రియాక్ట్ అయినట్లు కూడా పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓవియా లీక్డ్ వీడియోపై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో.. తాజాగా, సింగర్ చిన్మయి భర్త, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ‘X’ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘‘నేను ఎటువంటి తీర్పు లేకుండా చెబుతున్నాను. నాకు అనిపించిన దాన్ని పంచుకుంటున్నాను. నేను పీజీ చేస్తున్నప్పుడు... నాకు ఒక స్నేహితుడు ద్వారా ఓ నటి లీక్ వీడియో నా దగ్గరకు వచ్చింది. దీంతో నాకు కూడా ముందు చూడాలనే ఉత్కంఠ కలిగింది. కానీ ఒకసారి నేను వీడియో చూడటం మొదలు పెట్టాక ఏదో తప్పుగా అనిపించింది. ఆమెను వీడియో తీస్తున్నారని ఆమెకి కూడా తెలియదు.

అది చూడటానికి చాలా అసౌకర్యంగా అనిపించింది. అందుకే కొన్ని నిమిషాలకే చూడటం ఆపేశాను.. నేను చూసిన చివరి లీక్డ్ వీడియో అదే. దాని తర్వాత ఇంకెప్పుడూ అలా చూడను అని ఫిక్స్ అయ్యా. ఆ వీడియోలో ఉన్న బాధితులు ఎలాంటి బాధను అనుభవిస్తారో.. ఎంతలా నరకాన్ని అనుభవిస్తారో మనం ఊహించలేం. శృంగారం అనేది సహజంగా వచ్చే ఫీలింగ్.. ఎంతో మంది నటీనటులు వాటిల్లో నటించడానికి అంగీకరించి అలాంటి కంటెంట్‌ను అందుబాటులో ఉంచారు. లీక్ అయిన వీడియోలు చూడటం అవసరం లేదు. ఈ భయంకరమైన దండయాత్ర ద్వారా వీడియోలు లీక్ అయిన ప్రతి ఒక్కరు స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ చూసిన వారంతా ఓవియా వీడియో అవడం వల్లనే రాహుల్ ఈ పోస్ట్ పెట్టాడని చర్చించుకుంటున్నారు.


Similar News