'ఇండియన్ ప్రిక్స్ అథ్లెటిక్స్‌లో పీయూ విద్యార్థినికి రజత పతకం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కేరళ రాజధాని తిరువనంతపురం లో బుధవారం జరిగిన సెకండ్ ఇండియన్ latest telugu news..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కేరళ రాజధాని తిరువనంతపురం లో బుధవారం జరిగిన సెకండ్ ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ అథ్లెటిక్స్ ట్రిఫుల్ ఛేజ్ -3000 విభాగంలో పాలమూరు విశ్వవిద్యాలయానికి చెందిన మహేశ్వరి రజిత పతకం సాధించింది. ఇండియన్ గ్రాండ్-2 అథ్లెట్స్ మీట్ లో భాగంగా జరిగిన మూడు వేల మీటర్ల స్టిపుల్ ఛేజ్ ను మహేశ్వరి.. 10ని. 52.49 సెకండ్లలో గమ్యస్థానానికి చేరుకుంది. భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామానికి చెందిన మహేశ్వరి పాఠశాల స్థాయి నుండే అక్కడ ప్రిక్స్ పోటీలలో రాణిస్తూ.. ప్రస్తుతం షాద్ నగర్ లో పాలమూరు విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న మహేశ్వరి.. 2019 ఆలిండియా అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం, గుంటూరులో స్ట్రిపుల్ చేజ్ అండర్ -19 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మేరకు మహేశ్వరిని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్టర్ పిండి పవన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ బాలరాజు గౌడ్ తదితరులు అభినందించారు.