షాకింగ్ ట్విస్ట్.. విడాకులు రద్దు చేసుకుని మళ్లీ కలిసిపోతున్న స్టార్ కపుల్?

కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

Update: 2024-10-10 14:35 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ జంట 2022లో విడిపోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసి అభిమానులను షాక్‌కు గురి చేశారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. కానీ పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరు చూసుకుంటున్నారు. ఇక ధనుష్ విడాకుల గురించి తెలిసిన అభిమానులు అంతా కలిసి ఉంటే బాగుండు అని అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో.. ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రక్రియలో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది.

ఈ జంట చెన్నై కుటుంబ న్యాయస్థానం విచారణకు రమ్మని కోరగా వీరిద్దరూ వెళ్లలేదు. దీంతో న్యాయస్థానం విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసినట్లు సమాచారం. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలిసిపోతున్నారు కాబట్టి విచారణకు రాలేదని చర్చించుకుంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రజినీకాంత్ వెట్టైయాన్ నేడు విడుదల కావడంతో ధనుష్, ఐశ్వర్య ఇద్దరు ఒకే థియేటర్స్‌లో చూసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు విడాకులు రద్దు చేసుకుని పిల్లల కోసం మళ్లీ కలిసి పోవడం ఖాయం అని అంటున్నారు.


Similar News