Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ .. మరోసారి మారిన 'పుష్ప 2' రిలీజ్ డేట్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'పుష్ప 2'

Update: 2024-10-10 13:09 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'పుష్ప 2'. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్నారు. ఇక, బన్నీ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 6 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ కూడా ముగింపు దశకి వచ్చింది.

అయితే, ఈ మూవీ రిలీజ్ డేట్ మళ్ళీ ఛేంజ్ చేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి , ఈ ఏడాది ఆగస్టు 15 నే 'పుష్ప 2 మూవీ మన ముందుకు రావాల్సింది. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు 6కి పోస్ట్ పోన్ చేసారు. ఇప్పుడు డిసెంబర్ 5 కు రిలీజ్ డేట్ జరిపినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఓవర్సీస్ లో  అల్లు అర్జున్ కు ఎలాంటి మార్కెట్ ఉందో మనందరికీ తెలిసిందే.

డిసెంబర్ 5 న ఇండియాలో ప్రేక్షకుల ముందుకొస్తే , ఓవర్సీస్ లో డిసెంబర్ 4 న ప్రీమియర్స్ పడతాయి. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Tags:    

Similar News