Shiva Karthikeyan: ‘షేర్షా’ బాగుంటుంది కానీ.. అది నచ్చలేదు: స్టార్ హీరో సంచలన కామెంట్స్
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’(Amaran).
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’(Amaran). మేజర్ ముకుంద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియ స్వామి(Rajkumar Periya swami) దర్శకత్వం వహించారు. అయితే అమరన్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులో సాయిపల్లవి ఆర్మీ ఆఫీసర్ భార్యగా ఇరగదీసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. అయితే ఇక్కడ హీరో శివ కార్తికేయన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సక్సేస్ మీట్‌లో భాగంగా ఓ యాంకర్ మాట్లాడుతూ.. అమరన్, షేర్షా(Shershaah) రెండు సినిమాలు మేజర్ ముకుంద్, కెప్టెన్ విక్రమ్ బాత్రా ఆర్మీ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమాలే. అలాగే ఇంధు రెబెక్కా వర్గీస్, డింపుల్ చీమాల క్యారెక్టర్స్ కూడా ఇంచుమించు సేమ్ ఉంది అని అన్నారు. అయితే అమరన్ మూవీని షేర్షా సినిమాతో పోల్చడంపై శివకార్తికేయన్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ, “షేర్షా చాలా మంచి సినిమా, కానీ నాకు పోలికలు నచ్చవు. ఇది (అమరన్) దానికదే నిలుస్తుంది. ఇది మంచి సినిమానా లేదా సేమ్ మూవీ నా అని ఎవరికీ నిరూపించడానికి కాదు మేము చేసింది. ముకుంద్, ఇంధులు ఈ దేశానికి ఏం అందించారో చూపించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ సినిమా ప్రధానాంశం ప్రేమ. అలాగే అమాయకమైన, ఆత్మీయమైన ప్రేమను చూపించడమే మా ప్రాధాన్యత. అలా చూపించిన ప్రేమ ఈ రోజు ప్రేక్షకులను బలంగా తాకింది. ఆర్మీ సినిమాలన్నింటికీ సముచిత గౌరవంతో, రాజ్‌కుమార్‌కు తనదైన ప్రత్యేకత ఉంది. మరే ఇతర సినిమాతోనూ పోటీ పడేందుకు ప్రయత్నించలేదు’’ అంటూ శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.