'శివసేనే రాముడి పేరుతో నాటకాలు ఆడుతుంది'

ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రావుసాహెబ్ పాటిల్ ధన్వే కౌంటర్ ఇచ్చారు.

Update: 2022-04-11 09:46 GMT

ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రావుసాహెబ్ పాటిల్ ధన్వే కౌంటర్ ఇచ్చారు. శివసేన పార్టీనే రాముడి పేరుతో నాటకాలు ఆడుతుందని, బీజేపీ కాదని అన్నారు. అంతేకాకుండా ఈ మాజీ బీజేపీ కూటమి పార్టీ తన హిందుత్వాన్ని అధికారం కోసం కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలకు అమ్ముకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'శివసేన రాముడి పేరుతో రాజకీయాలు ఆడుతుంది. బీజేపీ కాదు. మేము ఎల్లప్పుడూ హిందుత్వం కోసమే పోరాడుతాం. శివసేన దానిని పేటెంట్లను అమ్ముకుంది. మేము కాదు, సమయానుకూలంగా శివసేనే రంగులను మారుస్తుంది. దేశంలో ఎమర్జేన్సీ ఉన్నప్పుడు వారు మాకు మద్దతు ఇచ్చారు. కానీ, రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రణబ్ ముఖర్జీని నామినేట్ చేసినపుడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు' అని అన్నారు. అంతకుముందు మహా సీఎం బీజేపీని ఉద్దేశించి శ్రీరాముడు జన్మించకపోతే బీజేపీ ఏ సమస్య లేవనెత్తేది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News