Shikhar Dhawan అరుదైన రికార్డ్.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ టీ 20ల్లో అరుదైన ఘనత సాధించాడు. Latest Telugu News

Update: 2022-04-10 11:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ టీ 20ల్లో అరుదైన ఘనత సాధించాడు.భారత క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు అందుకోని రికార్డ్ నెలకొల్పాడు. టీ 20లో 1000 బౌండరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఐదవ ఆటగాడిగా నిలిచాడు. గబ్బర్ కంటే ముందు.. క్రిస్ గేల్(1132), అలెక్స్ హేల్స్(1054), డేవిడ్ వార్నర్(1005), ఆరోన్ ఫించ్(1004) టీ 20లో 1000 బౌండరీలు బాదారు. తాజాగా శిఖర్ ధావన్ వారి సరసన చేరాడు. ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గబ్బర్ ఈ రికార్డ్ సాధించాడు. టీమిండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే ముందే గబ్బర్ ఈ ఘనత సాధించడం గమనార్హం. అయితే శిఖర్ ధావన్ తర్వాత టీ20ల్లో అత్యధిక బౌండరీలు సాధించిన క్రికెటర్లుగా విరాట్ కోహ్లీ(917), రోహిత్ శర్మ(875), సురేష్ రైనా(779) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags:    

Similar News