దిశ, సినిమా : నాలుగేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఫర్హాన్అక్తర్, శిబాని దండేకర్ ఇటీవలే ఒక్కటయ్యారు. సన్నిహితుల మధ్య జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన పిక్స్‌ను ఈ జంట సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్న న్యూ కపుల్.. లేటెస్ట్గా పోస్ట్ చేసిన పిక్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఫర్హాన్ వైట్ అండ్ వైట్ జాకెట్లో స్టైలిష్‌గా కనిపిస్తుండగా.. అతని పక్కనే తళుకులీనే డిజైనర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది శిబాని.
ఇక ఈ ఫోటోలో ఆమె పొట్ట కొద్దిగా పెరిగినట్లు కనిపించడంతో షాకైన నెటిజన్లు.. 'ఏంటి అప్పుడే గర్భవతివి అయ్యావా?' అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే 'పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందేమో. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు' అని కామెంట్ చేస్తున్నారు.