Sharad Pawar: ప్రధాని తో శరద్ పవార్ భేటీ

న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పార్లమెంట్‌లోని ..telugu latest news

Update: 2022-04-06 17:15 GMT

న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో మోడీతో భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అనంతరం శరద్ పవార్ మోడీతో భేటీ అయిన విషయం పై మీడియాతో సంభాషించారు. మహారాష్ట్రలో బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు జరగడం పై ప్రధానిని ప్రశ్నించినట్టు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు ఎంపీ సంజయ్ రౌత్, ఆయన కుటుంబసభ్యులపై ఈడీ కేసు, ఆస్తుల అటాచ్‌మెంట్.. అదేవిధంగా మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకోవడంపై పవర్ స్పందించారు.

'ఏ ప్రాతిపదికన సంజయ్ రౌత్‌పై చర్య తీసుకున్నారు? ఇది అన్యాయం. రౌత్‌పై చర్య తీసుకోవడానికి రెచ్చగొట్టడం ఏమిటీ? అతను కొన్ని విమర్శలు చేసినందున ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు జరిపిస్తారా? అని ప్రధానిని ప్రశ్నించినట్టు వివరించారు. అనంతరం యూపీఏకు నాయకత్వం వహిస్తారా అని అడిగిన ప్రశ్నపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. నాకు దాని మీద ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని శరద్ పవర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News