Viral Video: చైనా అపార్ట్‌మెంట్లలో ఆర్తనాదాలు..! వీడియో వైరల్
అల్లాడుతోంది మాత్రం సామాన్య ప్రజలే! Shanghai residents scream for help amid China's stringent Covid-19 lockdown.
దిశ, వెబ్‌డెస్క్ః ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్లు చైనా కరోనా తాకిడికి ఇప్పుడు కూడా విలవిల్లాడుతోంది. కారణాలు ఏమైనప్పటికీ, ఇక్కడ అల్లాడుతోంది మాత్రం సామాన్య ప్రజలే! అవును, చైనాలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు చూడనతంగా అత్యంత ఘోరమైన పరిస్థితిలో చైనా కొట్టుమిట్టాడుతోంది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో అత్యంత కఠినమైన లాక్‌డౌన్ నియంత్రణలు విధించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్న చైనాలో సామాన్య జనం ఇంటి తలుపుదాటి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో షాంఘైలోని అపార్ట్‌మెంట్ల నుండి ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. తాజాగా, లాక్‌డౌన్‌ను ఇంకొన్ని రోజులు పొడిగిస్తున్నామనే వార్తతో జనాల్లో అసహనం మరింత పెరిగింది. 'మేము చచ్చిపోతున్నాం' అంటూ కిటికీల నుండి పెద్దగా కేకలు పెడుతున్నారు.
తింటానికి తిండి లేక, బయటకి వెళ్లడానికి అనుమతి లేక ప్రజలు చావుకేకలు పెడుతున్నారు. ఈ పరిస్థితిని చూపెడుతూ ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అపార్ట్‌మెంట్లలో బంధీలుగా ఉన్న ప్రజలు కేకలు పెడుతూ, సహాయం కోసం వేడుకుంటున్న వీడియో అందర్నీ కలవరపెడుతోంది. ప్రసిద్ధ ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఎరిక్ ఫీగల్-డింగ్, షాంఘై నుండి ఈ వీడియోను పోస్ట్ చేసారు. "షాంఘైలోని నివాసితులు 7 రోజుల నగర లాక్‌డౌన్ తర్వాత ఎత్తైన అపార్ట్‌మెంట్ల నుండి అరుస్తున్నారు. "యావో మింగ్ లే" & "యావో సి" - అనే ఈ రెండు వ్యక్తీకరణలు "జీవితం, మరణం" అని అర్ధం వస్తాయని, అయితే వాటి అర్థం "మరణం కావాలని అడగడం" అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇలాగే కొనసాగితే త్వరలో మరింత విషాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు ఆహార కొరతకు దారితీస్తుందని ఆయన నివేదించారు. ఈ పరిస్థితుల్లో షాంఘై వాసులు లాక్‌డౌన్ కారణంగా రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నారనీ, చాలా మంది ప్రజలు దీనిని మానవ హక్కుల ప్రాథమిక ఉల్లంఘనగా పేర్కొన్నారని ఆయన అన్నారు. కాగా, ప్రభుత్వం మాత్రం ఇంటి నుండి ఎవ్వరూ బయటకు రావద్దని డ్రోన్ మైక్‌ల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.