ప్రెగ్నెన్సీ స్ట్రెస్: ఆందోళన, ఒత్తిడితో పడిపోతున్న లిబిడో లెవల్స్

దిశ, ఫీచర్స్: 31ఏళ్ల వర్షిత.. అప్పుడప్పుడే ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎదగడం ప్రారంభించింది. పెళ్లై రెండేళ్లయినా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేందుకు కరెక్ట్ టైమ్..Latest Telugu News

Update: 2022-07-23 06:37 GMT

దిశ, ఫీచర్స్: 31ఏళ్ల వర్షిత.. అప్పుడప్పుడే ప్రొఫెషనల్ కెరీర్‌లో ఎదగడం ప్రారంభించింది. పెళ్లై రెండేళ్లయినా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యేందుకు కరెక్ట్ టైమ్. కానీ గర్భం దాలిస్తే వృత్తిపరంగా సమస్యలు ఎదురవుతాయని భర్తతో శృంగారంలో పాల్గొన్న ప్రతీసారి భయపడుతుంది. ఒకవేళ తేడా అనిపిస్తే పిల్ వేసుకోవడం స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే 36ఏళ్లు వచ్చేసరికి మాతృత్వ మాధుర్యం పొందాలనుకున్న ఆమె బెడ్ రూమ్‌లో స్పార్క్‌ కోసం కష్టపడిపోతోంది. ఇంటర్‌కోర్స్‌ను కాలిక్యులేటెడ్ యాక్టివిటీగా కండక్ట్ చేస్తోంది. మొత్తానికి ప్రెగ్నెన్సీ విషయానికొస్తే టోకోఫోబియా(ప్రసవానికి సంబంధించిన విపరీతమైన భయం) అనేది సెక్స్‌లైఫ్‌ను స్పాయిల్ చేస్తుందని, జీవితంలో మరెన్నో సమస్యలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఓవర్‌థింకింగ్ ఎఫెక్ట్:

ప్రెగ్నెంట్ కాకూడదనే ఒత్తిడి, గర్భవతి కావాలనే కోరిక.. రెండూ కూడా లైంగిక జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయవచ్చు. సెక్స్ సమయంలో ఆనందంగా లేకుంటే, లిబిడో కాలక్రమేణా తగ్గిపోయి, చివరికి సెక్స్ పట్ల ఆసక్తిలేని పరిస్థితి చేరుకుంటారు. అసంతృప్తికరమైన లైంగిక జీవితం కారణంగా భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటారు. ఇది గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న జంటలతో పాటు గర్భాన్ని నివారించే వారిపై కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి లేదా ఆందోళన కారణంగా శరీరంలో స్ట్రెస్ హార్మోన్ల ఉత్పత్తి పెరిగిపోయి, హైపోథాలమిక్ పిట్యూటరీ ఓవరియన్ (HPO) యాక్సిస్, రీప్రొడక్టివ్ ఫంక్షన్స్‌ను ప్రభావితం చేస్తాయి.

స్ట్రెస్ అండ్ సెక్స్:

సెక్సువల్ ఇంటర్‌కోర్స్ పరిణామాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, శరీరం ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి బదులుగా ఒత్తిడిని ప్రేరేపించే న్యూరోఎండోక్రిన్ హార్మోన్‌లను విడుదల చేస్తుంది. ఫలితంగా తక్కువ ఉద్రేకం అనుభూతి చెందుతారు. ఈ పరిస్థితి యోని డ్రైగా మారేందుకు, తగినంత లూబ్రికేషన్ లేకపోవటానికి దారితీస్తుంది. ఫలితంగా బాధాకరమైన లైంగిక సంపర్కాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఒత్తిడికి లోనవుతున్నా, యాక్టివిటీని ఎంజాయ్ చేసేందుకు కమిట్ కాకపోయినా.. పెల్విక్ ఫ్లోర్ కండరాలు కుంచించుకుపోయి, చొచ్చుకుపోవటం కష్టమవుతుందని చెప్తున్నారు నిపుణులు.

ప్రెగ్నెన్సీ గురించి విపరీతమైన కోరిక:

గర్భం దాల్చాలనే ఆశతో భర్తలను ఆందోళనకు గురిచేస్తారు ఈ టైప్ ఆఫ్ వైఫ్స్. పీరియడ్స్, అండోత్సర్గం గురించి మాట్లాడుతూ చిరాకు తెప్పిస్తారు. అత్యాశ లేదా ఆందోళనతో ప్రెగ్నెన్సీ గోల్‌ను మైండ్‌లో ఉంచుకుని సెక్స్‌లో స్పాంటేనియస్ స్పార్క్, ప్లెజర్ మిస్ అవుతుంటారు. పార్ట్‌నర్‌ను హ్యాపీగా ఉంచాలనే ఆలోచన, ఆనందంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోతారు. అందుకే తరుచుగా బెట్టర్ సెక్స్ కోసం ప్రయత్నిస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

సెక్స్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి?

* ఇంటిమసీ విషయానికొస్తే కపుల్స్ స్పాంటేనిటీ మెయింటెన్ చేయాలని చెప్తున్నారు నిపుణులు. అదే బెస్ట్ సెక్సువల్ ఎక్స్‌పీరియన్స్‌కు దారితీస్తుందని చెప్తున్నారు.

* లివ్ ఇన్ ది మూమెంట్ మాదిరిగా.. గొప్ప ఆనందంతో ఆ అనుభూతిని ఆస్వాదించడం, అందుకు ప్రయత్నించడం ముఖ్యం.

* గర్భం దాల్చేందుకు పోరాడుతున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది. పైగా చుట్టుపక్కల వారి ప్రశ్నలు కూడా విసిగిస్తాయి. ఇలాంటి సమయంలో దంపతులిద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి. ఆందోళన, భయాలను పక్కనపెట్టి ఆలోచన ప్రక్రియలను మొదలెట్టాలి.

* ఈ విషయంలో చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మనసులో ఒత్తిడికి కారణమవుతున్నారని అనిపిస్తే వారితో ఓపెన్‌గా మాట్లాడాలి. వారి జోక్యం, సూచనలు ఉపయోగకరంగా లేవని మొహమాటంగా చెప్పేయాలి. బిడ్డకు జన్మనిస్తేనే 'సంపూర్ణ మహిళ' అనే సాంప్రదాయ ఆలోచన ఉన్నా సరే ప్రతీ స్త్రీ తల్లి కావాలని కోరుకోదు అనేది సత్యం. 


Similar News