బ్రేకింగ్..182 మంది పౌరులతో భారత్ చేరిన ఏడవ ఆపరేషన్ గంగా విమానం

Update: 2022-03-01 04:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 182 మంది భారతీయ పౌరులతో ఏడవ ఆపరేషన్ గంగా విమానం మంగళవారం బుకారెస్ట్ (రొమేనియా) నుండి ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయంలో భారతీయ విద్యార్థులకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే స్వాగతం పలికారు. ఇప్పటి వరకు ఈ తరలింపు పక్రియ ఆరు సార్లకు సాగింది. విమానాలలో 1,396 మంది భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుండి తిరిగి తీసుకువచ్చారు.

ఉక్రేనియన్ విమాన ప్రయాన సర్వీసులు మూసివేసిన తరువాత, రోమానియా, హంగేరి అలాగే పోలాండ్‌లతో భూ సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా తూర్పు యూరోపియన్ దేశంలో చిక్కుకుపోయిన తన పౌరులను తరలించడానికి భారతదేశం సౌకర్యాలు కల్పిస్తోంది. భారత దేశం ఈ తరలింపు మిషన్‌కు "ఆపరేషన్ గంగా" అని పేరు పెట్టింది.

Tags:    

Similar News