భర్త మరణం తర్వాత తొలిసారి కెమెరా ముందుకు సీనియర్ హీరోయిన్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే తన భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే తన భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే. భర్త మరణం అనంతరం చాలా రోజులకు ఆమె కోలుకున్నారు. తాజాగా.. సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకు వచ్చారు. నట కిరీటి, నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా జూలై 19న 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశాడు. ఈ సెలబ్రేషన్ మెత్తాన్ని తన కెమెరాలతో క్యాప్చర్ చేసింది కమెడియన్ ఆలీ భార్య జుబేదా. అక్కడి వచ్చిన అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సినిమాకు సంబంధించిన విషయాలు అడుగుతూ సంబరం చేసింది.
ఈ క్రమంలోనే మీనాతో కూడా మాటలు కలిపింది జుబేదా. మీకు వీరాభిమానిని.. గతంలో 'పెళ్లాం చెబితే వినాలి' సినిమా సమయంలో కలిశామని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కలిశామని చెప్తూ సంతోషపడిపోయింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్నానంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నని తెలిపింది. తెలుగులో సినిమాలు చేయడం లేదని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పకుండా తెలుగులో సినిమాలు చేస్తాను'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ చక్కరలు కొడుతుంది.