రూ.1 కోటి విలువ చేసే గంజాయి పట్టివేత

దిశ, భద్రాచలం : భారీగా నిషేధిత గంజాయి భద్రాచలంలో పట్టుబడింది. సుమారు దీని విలువ రూ.1 కోటి latest telugu news..

Update: 2022-03-26 11:29 GMT

దిశ, భద్రాచలం : భారీగా నిషేధిత గంజాయి భద్రాచలంలో పట్టుబడింది. సుమారు దీని విలువ రూ.1 కోటి పైనే ఉంటుంది. వివరాల్లోకి వెళితే..ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ సర్వేశ్వర్ ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్, డిగ్రీ కాలేజ్, బ్రిడ్జి రోడ్, చెక్ పోస్ట్ లలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో అశోక్ లేయలాండ్ దోస్త్ క్యారెజీ వెహికల్ (నెం : TS 15 UC 4934)లో ఎండు గంజాయి రవాణా అవుతుండగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి బీదర్ (కర్ణాటక రాష్ట్రం)కు రవాణా చేస్తున్న రాథోడ్ లక్ష్మణ్ అనే వ్యక్తి నుండి 600 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 300 ప్యాకెట్స్‌లో ఈ అక్రమ గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ గంజాయి ప్యాకెట్లు తో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించామని సీఐ సర్వేశ్వర్ తెలిపారు. పట్టుకున్న ఆ గంజాయి విలువ మార్కెట్ ధర ప్రకారం రూ.1 కోటి ఉంటుందని తెలిపారు. ఈ గంజాయి దాడిలో ఎస్ఐ ముభాషీర్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ కరీం, బాలు, కానిస్టేబుల్ సుధీర్, హరీశ్, వెంకటేష్, విజయ్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News