తెలంగాణలో 60 రకాల విత్తనాల ఉత్పత్తి..

రాష్ట్రంలో 18 పంటలకు అవసరమైన సుమారు 60 రకాల విత్తనాలను ఉత్పత్తి చేసి, రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Update: 2022-07-10 15:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 18 పంటలకు అవసరమైన సుమారు 60 రకాల విత్తనాలను ఉత్పత్తి చేసి, రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ ఏటా రాష్ట్రంలో సుమారు 5 నుంచి 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. విత్తనాభివృద్ధి కృషితో రైతులు వైవిధ్యమైన, లాభదాయకమైన పంటల సాగువైపు మళ్లుతున్నట్టు తెలిపింది. రాష్ట్ర రైతాంగంతో పాటు దేశంలోని ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్, ఛత్తీస్ ఘడ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విత్తనాలను ఎగుమతి చేస్తున్నట్టు ప్రకటనలతో పేర్కొన్నారు. కాగా 2021–22 అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 18.3 శాతాన్ని జమ చేసిందని, 48.4 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్టు తెలిపారు.


Similar News