సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం..
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగే మహానగరం ఆషాడ బోనాల ఉత్సవాల సందడి షురూ అయింది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగే మహానగరం ఆషాడ బోనాల ఉత్సవాల సందడి షురూ అయింది. మొదటగా జూన్ 30న గోల్కొండ బోనాలతో స్టార్ట్ అయిన పండగ వాతావరణం జూలై 28న మళ్లీ గొల్కొండ బోనాలతోనే ముగుస్తుంది. అయితే రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.
భాగ్యనగరంలో గోల్కొండ బోనాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానుండటంతో… మూడు వేల మంది సిబ్బందితో పాటుగా వందకు పైగా కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మహంకాళీ అమ్మవారి దేవాలయానికి వెళ్లే ముఖద్వారాలను ప్రారంభించిన మంత్రి తలసాని పోతరాజుల మధ్య డాన్స్ చేసి బోనాలకు ముందే పండగలో మంచి జోష్ నింపారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.