ఆ ట్రస్ట్‌తో కళాశాల ప్రిన్సిపాల్‌కు పరిచయం.. ఆనందంలో విద్యార్థినిలు

Update: 2022-03-05 06:55 GMT

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు స్కాలర్ షిప్‌లు అందజేశారు. మహిళా విద్యార్థుల సాధికారతలో భాగంగా మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు గత సంవత్సరం నవంబర్ మాసంలో స్కాలర్ షిప్ ప్రక్రియ ఆన్లైన్‌లో మొదలెట్టారు. ఈ క్రమంలో కల్వకుర్తి ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థులు 73 మంది అప్లై చేయగా మొదటి విడతగా 63మందికి మంజూరయ్యాయి. అందులో భాగంగా శుక్రవారం మలబార్ గోల్డ్ ట్రస్టు దాతలు జిజాన్, రమణి రెడ్డి, సుభాన్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై 67 మంది విద్యార్థినిలకు 6 లక్షల 50 వేల చెక్కులను అందజేశారు.

మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్‌‌తో కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి వ్యక్తి గత పరిచయం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ కళాశాలలో దక్కని మంచి అవకాశం మన కళాశాల‌కే సాధ్యమైందని తోటి ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్, కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి లీడ్ ఇండియా కోఆర్డినేటర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుధాకర్, నిర్మల ప్రభుత్వ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు,శోభ, లెక్చరర్లు భీమేశ్,సదానందం గౌడ్,మల్లేష్,శ్రీనివాస్ రెడ్డి,బాల రాజ్,పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News