SBI కస్టమర్లకు అలర్ట్.. లోన్ తీసుకునే వారికి హెచ్చరిక

దిశ,వెబ్‌డెస్క్ : భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Update: 2022-04-18 06:28 GMT

దిశ,వెబ్‌డెస్క్ : భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు mclrను పెంచినట్లు బ్యాంకు ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (MCLR)ను ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. అన్ని రకాల రుణ కాలావధికి (all loan tenors) ఈ పెంపు వర్తిస్తుంది. దీని వలన రుణాలు తీసుకునే వారిపై భారం పడనుంది. హోమ్ లోన్, కార్ లోన్ వంటి వాటిపై ఈఎంఐ భారం పెరగనుంది. ఇక ఇది ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటికే లోన్ తీసుకొని ఉన్న, అలాగే భవిష్యత్తులో రుణగ్రహీతల కోసం కారు, హోంలోన్, ఇతర రుణాల EMIలు పెరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 15 నుంచి కాలవ్యవధి వారీగా అమల్లోకి వచ్చిన MCLR వివరాలు..

ఒక నెల: ప్రస్తుత రేటు - 6.65 శాతం.. కొత్త రేటు - 6.75 శాతం

మూడు నెలలు: ప్రస్తుత రేటు - 6.65 శాతం.. కొత్త రేటు - 6.75 శాతం

ఆరు నెలలు: ప్రస్తుత రేటు - 6.95 శాతం.. కొత్త రేటు 7.05 శాతం

ఒక సంవత్సరం: ప్రస్తుత రేటు - 7.00 శాతం.. కొత్త రేటు 7.10 శాతం

రెండు సంవత్సరాలు: ప్రస్తుత రేటు - 7.20 శాతం.. కొత్త రేటు 7.30 శాతం

మూడు సంవత్సరాలు: ప్రస్తుత రేటు - 7.30 శాతం.. కొత్త రేటు 7.40 శాతం

ఇటీవల MCLRని పెంచిన ఏకైక బ్యాంక్ SBI మాత్రమే కాదని కూడా గమనించాలి. మరో ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. టేనర్‌లలో 5 bps ద్వారా.. బెంచ్‌మార్క్ వన్-ఇయర్ టేనర్ MLCR ఇప్పుడు ఏప్రిల్ 12, 2022 నుంచి అమలులోకి వచ్చేలా 7.35 శాతంగా నిర్ణయించబడింది. "ఏప్రిల్ 12, 2022 నుండి అమల్లోకి వచ్చే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) సమీక్షను బ్యాంక్ ఆమోదించింది", BoB రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

MCLR అంటే ఏమిటి ?

MCLR లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు అనేది బెంచ్‌మార్క్ వడ్డీ రేటు, ఇది బ్యాంకులు తమ కస్టమర్‌లకు రుణాలు ఇవ్వడానికి అనుమతించే కనీస వడ్డీ రేటు. కస్టమర్లకు ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల ధరను నిర్ధారించడానికి RBI 2016లో దీనిని ప్రవేశపెట్టింది.

Tags:    

Similar News