దారుణం.. దళితులపై సర్పంచ్ దాడి

Update: 2022-03-04 16:55 GMT

దిశ, మంచిర్యాల: జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వేముల శేఖర్, వేముల సుమన్ అనే అన్నదమ్ములపై గ్రామ సర్పంచ్ జైపాల్ గౌడ్ కులాన్ని దూషిస్తూ తమపై తాటి మట్టలతో దాడి చేశారని బాధితులు తెలిపారు. శుక్రవారం రోడ్డుపై వెళ్తున్న అన్నదములపై సర్పంచ్ జైపాల్ గౌడ్ కుట్రపూరితంగా వ్యవహరించి దాడి చేశాడని, వార్డు మెంబర్, గ్రామస్తులు ఆపిన ఆగకుండా తమపై దాడి చేశారంటూ బాధితులు వాపోయారు. 

Tags:    

Similar News