జోరుగా ఇసుక మాఫియా.. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా
దిశ, హాలియా : గతంలో బంగారం కొనుక్కుని దాచుకునే వాళ్ళం, ప్రస్తుతం బంగారం లాంటి ఇసుకను అక్రమంగా డంపు చేసి
దిశ, హాలియా : గతంలో బంగారం కొనుక్కుని దాచుకునే వాళ్ళం, ప్రస్తుతం బంగారం లాంటి ఇసుకను అక్రమంగా డంపు చేసి దాచుకుంటున్నారు ఇసుక మాఫియా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక మాఫియాను అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ విధానం తీసుకు వచ్చింది. దీని ద్వారా అవసరం ఉన్న ప్రతి ఒక్కరు సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవడం వలన ప్రభుత్వం సూచించిన వాహనం ద్వారా సంబంధిత కస్టమర్ కు అందిస్తారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తో పాటు ఆయా ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. అందులో భాగంగానే అనుముల మండలం లో ప్రభుత్వం మైనింగ్ శాఖ అధికారులు ఒకే మండలంలో 4 రీచ్‌లను ఏర్పాటు చేశారు. వాటిలో పులిమామిడి, చింతగూడెం, పాలెం,రామడుగు గ్రామాలలో ఇసుక రీచ్‌ల ఏర్పాటు చేసి కావలసిన వారికి ట్రాక్టర్ల సాయంతో తరలించడం జరుగుతుంది. ఇక్కడ కొంత మంది అక్రామర్జనే ద్యేయంగా అలవాటు పడిన కొందరు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక రవాణా చేస్తూన్నారు. మండలంలోని అనుముల, పాలెం, రామడుగు, పులిమామిడి ప్రాంతాల్లో ఇసుక రీచ్లు గ్రామానికి దగ్గరగా ఉండటంతో అక్రమార్కులకు పగలు రాత్రి తేడా లేకుండా రిచ్‌ల నుంచి ఇసుక తరలిస్తున్నారు.
కొంతమంది ఇసుక ట్రాక్టర్ యజమానులు ఒక టీం గా ఏర్పడి పగలు,రాత్రి సమయంలో కాపలా కాస్తూ ఇసుకను దగ్గరలోని తోటలలో డంప్ చేస్తున్నారు. అనంతరం వాటిని ఆన్ లైన్ పెట్టిన రోజు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఆన్‌లైన్ విధానంలో రిచ్ లో ఉన్న ట్రాక్టర్కు మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన వాహనానం మత్రామే రిచ్లోకి వెళ్ళి ఇసుకను నింపుకొని కస్టమర్ కు డెలివరీ చేయాలి. మెస్సెజ్ రాని ట్రాక్టర్స్ ఇసుకకు వెళ్లకూడదు కాని ఇక్కడ మాఫియాకు వాటితో సంబంధం లేదు, మెస్సెజ్ రాకపోయినా,రిచ్ పెట్టకపోయినా వీరికి సంబంధం లేకుండా ప్రతి రోజు అక్రమంగా ఇసుకను తరలిస్తారు.ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పట్టణంలో నిత్యం వందల ట్రిప్పులు అవసరం ఉండటంతో దళారీ వ్యవస్థ ఏర్పాటై, కస్టమర్లని ఆన్లైన్ లో ఇసుక బుక్ చేసుకోకుండా వారిని తప్పుదోవ పట్టిస్తూ ఆన్లైన్‌లో బుక్ చేసుకుంటే మంచి ఇసుక రాదంటూ, మేమైతే మంచిది తెప్పిస్తామంటు వారికి మాయ మాటలు చెప్తూ ఇసుక అక్రమ రవాణా వైపు మొగ్గు చూపేలా చేస్తున్నారు. దానితో ఆగకుండా కొంతమంది ట్రాక్టర్ యజమానులతో మాట్లాడి ఆన్లైన్ లేకుండా బ్లాక్ మార్కెట్ ద్వారా ఇసుక తరలిస్తు ఆన్లైన్ విధానానికి గండి కొడుతున్నారు.
ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం..
అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లపై ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమనే చెప్పాలి.అక్రమ ఇసుక ట్రాక్టర్లను కట్టడి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నడం గమనార్హం. మండలంలో ఉన్న నాలుగు రీచ్‌లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో ఎటువంటి చలనం లేదంటూ ఫిర్యాదు చేసినా కొందరు బహిరంగంగానే వాపోతున్నారు.రిచ్ లా సర్పంచులు అక్రమ ఇసుక రవాణా అవుతుందని కొన్ని రోజులు రిచ్ బంద్ చేయాల్సిందిగా జిల్లా అధికారులకు మొర పెట్టుకోవడంతో రిచ్ కొద్ది దినాలు బంద్ చేసినట్టు తెలుస్తుంది.కాని మండలంలో ఉన్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ట్లు తెలుస్తోంది.
చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు..
మండలం లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మండల తహశీల్దార్, స్థానిక ఎస్సైకు చరవాణి ద్వారా ఫిర్యాదులు వచ్చిన వారు సకాలంలో స్పందించడం లేదని పిర్యాదులు చేసిన కొందరు వాపోతున్నారు.వారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ప్రయోజనం లేదని వారు అంటున్నారు.ఇసుక డంపుల ఫోటోలు పెట్టిన అటువైపుగా తెలుసుకునే ప్రయత్నం కూడా చెయరని తెలుస్తుంది. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు అధికారులు అక్రమ ఇసుక,భూ తగాదాలతో బదిలీ కావడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు అక్రమ ఇసుక వైపు వెళ్లడం లేదనే విమర్శలు లేకపోలేదు. మాకు ఎందుకు తలకాయ నొప్పి అనే విధంగా దాంట్లో తలదూర్చడం లేదంటూ మరికొందరి ఆరోపణ.
కేసులు చేసిన మారని ఇసుక మాఫియా..
గతంలో మాదిరిగానే అక్రమ ఇసుక చెస్థున్న వారిపై కేసులు,బైండోవర్లు చేసిన వారిలో కొంతైనా మార్పు రాలేదనె చెప్పాలి. దొరికిన ట్రాక్టర్ పదే పదే దొరకడం వారికి 5000 రూపాయల పెనాల్టీ రాసి పంపడంతో వారికి అదొక అత్తారిల్లు గా మారిపోయింది.మూడు పూలు ఆరు కాయలుగా సాగే అక్రమ ఇసుక వ్యాపారం లో 5000 రూపాయలు చాలా సులువుగా కట్టి బయటపడుతూ ,మరల అదే పని చేస్తున్నారు.అలా కాకుండా అక్రమ ఇసుక తరలిస్తు పట్టుబడిన వాహనాలను ఇసుక రిచ్లో లేకుండా పూర్తిగా తీసివేయాలని,వాటిని రిచ్ లోకి రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకుంటేనే అక్రమ మైనింగ్ అపొచ్చని మరికొందరి మాట.