Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని చెరగని ముద్ర వేసుకుంది.

Update: 2024-10-24 08:27 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని చెరగని ముద్ర వేసుకుంది. తన సినిమాలతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకోవడంతో పాటు స్టార్ హీరోల సరసన నటించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటికి కోడలు అయింది. కానీ మనస్పర్థలు రావడంతో కొద్ది కాలానికే విడాకులు తీసుకుని విడిపోయింది. అయితే ఇటీవల ఈ అమ్మడు మయోసైటీస్ బారిన పడటంతో సినిమాలకు దూరం అయింది.

అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండి పలు హాట్ ఫొటోలు షేర్ చేసింది. ప్రజెంట్ సమంత ‘సిటాడెల్: హనీ, బన్నీ’(Citadel: Honey, Bunny) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో సామ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే ఈ అమ్మడు ఓ ఈవెంట్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న.. డ్రెస్‌ను వేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక పబ్లిక్‌గా డ్రెస్ వేసుకోవడం చూసిన నెటిజన్లు, సమంత అభిమానులు ఇలాంటి ఉద్యోగం వస్తే జీతం కూడా తీసుకోమని అంటున్నారు.

Tags:    

Similar News