'బిగ్ బాస్ 16'.. హోస్ట్‌‌కు వెయ్యి కోట్ల రెమ్యూనరేషన్?

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2022-07-17 12:56 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో తన మార్క్ చూపిస్తున్న కండలవీరుడు.. 13 ఏళ్లుగా బిగ్‌బాస్‌ హిందీ వెర్షన్‌‌కు హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి సీజన్‌కు పారితోషికం పెంచుకుంటూ పోతున్న హీరో.. బిగ్‌బాస్ 15వ సీజన్ కోసం రూ. 350 కోట్లు అందుకున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే.. త్వరలో మొదలు కానున్న 'బిగ్ బాస్ 16' కోసం సల్మాన్‌నే హోస్ట్‌గా వ్యవహరించాలంటూ నిర్వాహకులు కోరినట్లు సమచారం. కానీ తను ఆసక్తి చూపకపోవడంతో ఆందోళన చెందిన మేకర్స్.. ఏకంగా వెయ్యి కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. నిజంగా సల్లుభాయ్ ఈ రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన మొదటి వ్యక్తిగా రికార్డుల్లో నిలిచిపోతాడు.

Tags:    

Similar News