Sai Pallavi: తండేల్ ప్రెస్మీట్లో సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్..!!
నేచురల్ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
దిశ, వెబ్డెస్క్: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్గా విడుదలైన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగ చైతన్య(Naga Chaitanya) తండేల్ (Tandel) సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా నేడు తండేల్ మూవీ విడుదల తేదీ ప్రకటించి.. ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల కానుందని అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్లో సాయిపల్లవి మాట్లాడుతూ.. అమరన్(Amaran) సినిమాకు తెలుగు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ లభించిందని.. పెద్ద సక్సెస్ ఇచ్చారని తెలిపింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. నేను ఎప్పుడు ఏం సాధించినా కూడా అల్లు అరవింద్ ఏవైనా స్పెషల్ అకేషన్స్ కు ఫోన్ చేస్తారని వెల్లడించింది. ఆయన నన్ను సొంత కుమార్తెలా ట్రీట్ చేస్తారని కొనియాడింది. అస్సలు తండేల్ చాలా చిన్న మూవీగా స్టార్ట్ అయి..పెద్దగా అయిందని పేర్కొంది. తండేల్ రియల్ లైఫ్ స్టోరీ. కాగా దానికి తగ్గట్లు ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత పెద్దగా చేస్తామని అస్సలు ఊహించలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More..