యుద్ధం వల్ల రూ. 62 వేలకు చేరుకోనున్న బంగారం ధరలు!

Update: 2022-02-24 16:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ నేపథ్యంలో రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ల పరిస్థితి ప్రతికూలంగా ఉండనున్నది. ఈ కారణంతో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి పరిణామాలతో బంగారంపై పెట్టుబడులు భారీగా పెరగవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం.. పసిడి ధరలు ఈ ఏడాది రూ. 55,000కు, వచ్చే ఏడాదిలో రూ. 62,000కు చేరుకోవచ్చని చెబుతున్నారు. గురువారం నాటి పరిస్థితుల మధ్య బంగారం 10 గ్రాముల ధర రూ. 51 వేలను దాటింది. ప్రధానంగా బంగారం ధరలు పెరిగేందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రష్యా, యూరప్, నాటో దేశాల మధ్య పూర్తిస్థాయి ఉద్రిక్తతలు నెలకొనవచ్చు. రెండు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనివల్ల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు చూస్తాయని నిపుణులు వెల్లడించారు. దీన్ని బట్టి వచ్చే రెండేళ్లలో బంగారం ధరలు ఇప్పుడున్న స్థాయి నుంచి అదనంగా రూ. 10,000 పెరుగుతాయని వారు భావిస్తున్నారు.

Tags:    

Similar News