మూడ్రోజుల్లో RRR రిలీజ్.. అభిమానులకు షాకింగ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రేమికులు తమ అభిమాన హీరోల సినిమా విడుదల అవుతుందంటే- latest Telugu news

Update: 2022-03-21 13:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ప్రేమికులు తమ అభిమాన హీరోల సినిమా విడుదల అవుతుందంటే చేసే హంగామా అంతా ఇంతా కాదు. కటౌట్‌లు, పాలభిషేకాలు ఇలా ఒక పండుగను తలపిస్తారు. థియేటర్లో తమ అభిమాన నటుడు కనబడగానే విజిళ్లు వేయడం, పేపర్లు చల్లడం, స్క్రీన్ ముందుకు వెళ్లి డ్యాన్స్‌లు.. ఇలా రకరకాలుగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ రాజామౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. కాగా, మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు.. అంతే కాకుండా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నటులు. ఇలా ఇద్దరు స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించనుండటంతో వీరి అభిమానులు చేసే అరాచకాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందుగానే కొన్ని థియేటర్ యజమానులు అభిమానుల రచ్చ తట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొన్ని థియేటర్‌లలో స్క్రీన్ ముందు ఉండే పోడియంపైకి అభిమానులు వెళ్లకుండా మేకులు బిగుస్తుండగా.. మరికొన్ని చోట్ల కంచెలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Tags:    

Similar News